సమంత ఈజ్ బ్యాక్
Actor ProfileActor

సమంత ఈజ్ బ్యాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత ఈజ్ బ్యాక్ , సాయిపల్లవి, శ్రీలీలకు షాక్ .. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Asianet News Telugu9 Jul 2026
సమంత ఈజ్ బ్యాక్ , సాయిపల్లవి, శ్రీలీలకు షాక్ .. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే

ఇండియాలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే మే నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సమంత తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అలియాభట్‌ బ్యాక్‌ అయ్యింది. వీరితోపాటు నయనతార సత్తా చాటింది. మరి కాజల్‌, శ్రీలీల, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా వంటి హీరోయిన్లు ఏ స్థానంలో నిలిచారనేది చూద్దాం. సమంత చాలా నెలలుగా మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. అయితే గత నెల(ఏప్రిల్‌) లో ఆమె ఒక్క స్థానం పడిపోయింది. మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోగా, ఇప్పుడు మే నెలలో మరోసారి సత్తా చాటింది. తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకుంది. సమంత తాజాగా `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గత నెల మొదటి స్థానంలో ఉన్న అలియా భట్‌ ఇప్పుడు రెండో స్థానానికి పరిమితమయ్యింది. ఇక మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉంది. ఆమె గత నెలలోనూ ఇదే స్థానంలో ఉండగా, ఇప్పుడు మరోసారి తన స్థానాన్ని పదిలపర్చుకుంది. అలాగే నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా తన స్థానంలో మార్పు లేదు. నాల్గో స్థానంలో ఉంది. ఆమె ప్రస్తుతం `మైసా`, `రణబాలి` వంటి చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో నటించిన `కాక్‌ టెయిల్‌ 2` థియేటర్లో సందడి చేస్తోంది. ఇక ఐదో స్థానంలో కాజల్‌ ఉంది. ఆమె సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలు లేకపోయినా కాజల్‌ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటోంది. చాలా నెలలుగా పెద్దగా మార్పు లేదు. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న సాయిపల్లవి డౌన్‌ అయ్యింది. ఆమె ఒక్క స్థానం పడిపోయి ఏడో స్థానానికి పరిమితమయ్యింది. ఏప్రిల్‌లో ఏడో స్థానంలో ఉన్న నయనతార మేలో