
Vaibhav Sooryavanshi Records: ఐపీఎల్ వేదికగా పరుగుల సునామీ సృష్టించి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న భారత సరికొత్త బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. జూన్ 26 నుంచి బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ద్వారా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ టీమిండియా క్యాప్ అందుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న 5 భారీ రికార్డులు ఇవే. ఐర్లాండ్‌లో వైభవ్ క్రేజ్.. ప్రత్యేకంగా తాత్కాలిక స్టాండ్‌లు! వయసు కేవలం 15 ఏళ్లే అయినా, దేశవాళీ క్రికెట్ నుంచి మొన్నటి ఐపీఎల్ వరకు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. జూన్ 26న సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూడటం కోసం ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా మైదానంలో తాత్కాలిక స్టాండ్‌లను నిర్మిస్తోంది అంటేనే ఈ కుర్రాడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. అయితే, ఇటీవల ఐపీఎల్ సమయంలోనే తన 15వ పుట్టినరోజు జరుపుకున్న వైభవ్, ఐర్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే సచిన్ పేరిట ఉన్న మూడు దశాబ్దాల నాటి రికార్డు కనుమరుగవుతుంది. భారతదేశం తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టిస్తాడు. టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ (4 సిక్సర్లు) రికార్డు