
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Rajasthan Police Controversy News: శాంతిభద్రతలను కాపాడడమే కాకుండా.. ప్రజల సమస్యలను ఓపికగా.. విని పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ శాఖలో కొందరి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల యావత్ శాఖకే.. తీరని మచ్చ వస్తోంది.. తాజాగా రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపేలా.. కనీస మర్యాదను విస్మరించిన ఘటన.. వెలుగు చూసింది.. తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఒక వృద్ధుడి పట్ల ఒక మహిళ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది... అసలేం జరిగిందంటే..? డూంగర్‌పూర్ జిల్లాలోని బిచ్చివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు తన వ్యక్తిగత సమస్యపై ఫిర్యాదు చేసేందుకు.. ఎన్నో ఆశలతో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌ను కలిసి తన సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించాడు.. అయితే, సదరు కానిస్టేబుల్ ఆ వృద్ధుడి వయసుకు గానీ.. ఆయన బాధకు గానీ కనీస గౌరవం ఇవ్వలేదు. ఆ వృద్ధుడు చేతులు కట్టుకుని దీనంగా నిలబడి తన సమస్యను వివరిస్తుంటే.. ఆమె మాత్రం తన సీట్లో దర్జాగా కూర్చుని, ఎదురుగా ఉన్న టేబుల్‌పై రెండు కాళ్లు చాపి అత్యంత అహంకారపూరితంగా వ్యవహరించింది. వృద్ధుడి ఆవేదనను వినడం పక్కన పెడితే.. ఆమె ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నెటిజన్ల ఆగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్