సోష ల్ మీడియాకు దూరంగా క యాదు
Actor ProfileActor

సోష ల్ మీడియాకు దూరంగా క యాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సోష ల్ మీడియాకు దూరంగా క యాదు
Telugu Times21 Jun 2026
సోష ల్ మీడియాకు దూరంగా క యాదు

కయాదు లోహర్(Kayadhu Lohar) సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ యంగ్ హీరోయిన్, కొంతకాలం పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన నిర్ణయాన్ని పంచుకున్న కయాదు, శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కూడా జీవితంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్క్రీన్‌లకు అవతల ఉన్న జీవితాన్ని మరింతగా ఆస్వాదించాలని, తనతో తాను సమయం గడపాలనే ఆలోచ‌న‌తోనే ఈ డెసిష‌న్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తన ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కయాదు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా, తన సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్‌ను త‌న టీమ్ అఫీషియ‌ల్ అకౌంట్స్ ద్వారా అందిస్తాయ‌ని స్పష్టం చేశారు. అందరికీ ప్రేమ, సంతోషం, ప్రశాంతత కలగాలని ఆకాంక్షిస్తూ త్వరలోనే మరింత ఉత్సాహంతో తిరిగి వస్తానని తన సందేశంలో పేర్కొన్నారు. ఆమె నిర్ణయానికి అభిమానులు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన అడుగేనని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెరుగుతున్న పని ఒత్తిడి, నిరంతర ఆన్‌లైన్ ఉనికి కారణంగా పలువురు నటీనటులు సోషల్ మీడియా డీటాక్స్‌ను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కయాదు నిర్ణయం కూడా అదే ధోరణిని ప్రతిబింబిస్తోంది. కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్‌(Dulquer Salman)తో ఐ యామ్ గేమ్(I am Game), నాని(nani)తో ది ప్యారడైజ్(The paradise), జీవీ ప్రకాశ్‌(GV Prakash)తో ఇమ్మోర్టల్(Immortal), అథర్వా(Adharva) నటిస్తున్న ఇదయం మురళి(Idayam Murali)తో పాటూ మారి సెల్వరాజ్(maari Selvaraj) తెరకెక్కిస్తున్న మంజనతి(Manjanathi) వంటి సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. సోషల్ మీడియాకు దూరమైనా, ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా కయాదు పేరు మాత్రం సినీ