స్వ యంభు రిలీజ్ డేట్ అదేనా
Actor ProfileActor

స్వ యంభు రిలీజ్ డేట్ అదేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వ యంభు రిలీజ్ డేట్ అదేనా
Telugu Times18 Aug 2026
స్వ యంభు రిలీజ్ డేట్ అదేనా

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil siddharth) నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభు (Swayambhu) రిలీజ్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడటంతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిఖిల్ నెలల తరబడి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడంతో పాటు, తన పాత్రలో సహజత్వం తీసుకురావడానికి శారీరకంగా కూడా పూర్తిగా మారిపోయాడు. ఈ డెడికేషన్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ తీసుకురాగా, విజువల్ స్కేల్‌తో పాటు కథా నేపథ్యం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డైరెక్ట‌ర్ భరత్ కృష్ణమాచారి(Bharath Krishnamchari) ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, సంయుక్తా మీనన్(Samyuktha menon), నభా నటేష్(Nabha natesh) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అఫీషియ‌ల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వ‌స్తే స్వయంభు ప్రమోషన్స్ మరింత వేగం అందుకుని, సినిమా చుట్టూ ఉన్న అంచనాలు మరోస్థాయికి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు