స్విమ్మింగ్ పూల్ లో విగతజీవిగా టెక్కీ
Actor ProfilePolitician

స్విమ్మింగ్ పూల్ లో విగతజీవిగా టెక్కీ

Total News1
Movie Updates0
Sources1
స్విమ్మింగ్ పూల్ లో విగతజీవిగా టెక్కీ - ఏం జరిగింది
Oneindia Telugu15 Jun 2026
స్విమ్మింగ్ పూల్ లో విగతజీవిగా టెక్కీ - ఏం జరిగింది

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన టీమ్‌ ఔటింగ్‌ విషాదంగా మారింది. స్నేహితులతో, సహోద్యోగులతో సరదాగా గడపాల్సిన రాత్రి.. మంచిర్యాలకు చెందిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గండ్ల రాము మృతితో కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది.శనివారం రాత్రి రాము తన సంస్థకు చెందిన సుమారు 20 మంది సహోద్యోగులు, టీమ్‌ లీడర్‌తో కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పార్టీ సందర్భంగా మద్యం సేవించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే సమయంలో రాముకు మరో ఉద్యోగితో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.స్విమ్మింగ్‌ పూల్‌లో రాము మృతి.. హత్య కేసు నమోదుచౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మన్మథరావు తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో రాము స్విమ్మింగ్‌ పూల్‌లో పడి ఉన్నట్లు సహోద్యోగులు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడిని కాపాడలేకపోయారు.తరువాత రామును చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఆసుపత్రి నుంచి పోలీసులకు సుమారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో సమాచారం అందింది. ఆదివారం ఉదయం రాము తండ్రి జి.అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం, వాగ్వాదం తర్వాత రామును కర్రతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అనుమానితుడిగా ఖరారు చేయలేదని, ఘటన సమయంలో అక్కడ ఉన్నవారిలో చాలామంది మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.పోస్టుమార్టం నివేదికపై దృష్టిరాము మరణానికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. అతడు దాడి వల్ల మృతి చెందాడా, లేక స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఘటన స్థలంలో రాము ఐడీ కార్డు, మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు