
Save The Tigers 3 Review || వెబ్‌సిరీస్: సేవ్ ది టైగర్స్ 3; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, రోహిణి, గంగవ్వం, ఝాన్సీ తదితరులు; క్రియేటర్స్: మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతమ్; నిర్మాత: శివ మేక, సాహితి చింతలపూడి; దర్శకత్వం: శ్రీరామ్; స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్‌స్టార్ కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా రూపొందించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘సేవ్ ది టైగర్స్’ (Save The Tigers ) ఒకటి. ఇప్పటివరకూ రెండు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ ముచ్చటగా మూడోసారి అలరించడానికి వచ్చింది. నిత్య జీవితంలో భార్య-భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలనే సరదాగా తెరపై ఆవిష్కరించిన మొదటి రెండు సీజన్లు అలరించగా, మూడో సీజన్‌లో దేవుడితో ముడిపెట్టారు. మరి ఈ సీజన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభివన్ గోమఠం) కెరీర్‌లో ఇబ్బందులు పడుతుంటారు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న గంటా రవి ఎన్నికల్లో ఓడిపోతాడు. మరోవైపు భార్య హైమా (జోర్దార్ సుజాత) పోరు పడలేక బస్తీ నుంచి గేటేడ్ కమ్యూనిటీకి మారిపోతాడు. అయినా, మనశ్శాంతి ఉండదు. విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) అపార్థం చేసుకోవడంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. సినీ రచయిత కావాలనుకున్న రాహుల్ తన భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మాట కాదనలేక ఉద్యోగంలో చేరతాడు. అయితే, తన నోటి తొందర వల్ల ఆ ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. దీంతో తమ కష్టాలను చెప్పుకోవడానికి ముగ్గురు బార్‌కు చేరుకుంటారు. తాగిన మైకంలో గంటా రవి, విక్రమ్, రాహుల్ మరో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ అయిన వాళ్లు కూడా అచ్చం ఈ ముగ్గురిలానే ఉంటారు. ఒకేలా ఉన్న వ్యక్తుల్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? వాళ్లుకు