సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ
Actor ProfilePolitician

సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ
AP7AM20 Jun 2026
సేవ్ ద టైగర్స్ 3' జియో హాట్ స్టార్ సిరీస్ రివ్యూ

'సేవ్ ద టైగర్' సిరీస్ నుంచి గతంలో రెండు భాగాలు వచ్చాయి. ప్రియదర్శి .. కృష్ణ చైతన్య .. అభినవ్ గౌతమ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి మూడో భాగాన్ని వదిలారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఫాంటసీ టచ్ ఇచ్చిన మూడో సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. గంటా రవి ( ప్రియదర్శి) తన భార్య హైమా (సుజాత) పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీకి మారిపోతాడు.అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేక నానా ఇబ్బందులు పడుతూనే రాజకీయాలలో ఎదుగుతూ ఎమ్మెల్యే అవుతాడు. ఇక రాహుల్ (అభినవ్ గౌతమ్) రైటర్ గా బిజీ అవుతాడు. అవార్డులతో పాటు విమర్శలు వచ్చి పడుతుంటాయి. విక్రమ్ ( చైతన్య కృష్ణ) హారిక అనే అమ్మాయితో చనువుగా ఉండటం చూసిన అతని భార్య రేఖ విడాకుల నోటీసు పంపిస్తుంది. ఒక వైపున కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పటికీ, విక్రమ్ తన పద్దతి మాత్రం మార్చుకోడు.గంటా రవి తన పదవిని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటాడు. రాహుల్ కొత్త కథల కోసం ప్రయత్నించకుండా వేరొకరి కథలను కాపీ చేస్తుంటాడు. భార్యకి దూరమైన విక్రమ్ వేరే అమ్మాయిలను వేధించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురిపై పోలీస్ లకు ఫిర్యాదులు అందుతాయి. పోలీస్ కేసు ముగ్గురినీ భయపెడుతుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అనే విషయంపై ఒక క్లబ్ లో సమావేశమవుతారు. తమ పట్ల భార్యలు ప్రవర్తిస్తున్న తీరును గురించి ప్రస్తావిస్తారు. తమని ఈ స్థితికి తీసికొచ్చింది 'పెళ్లి' అనే రెండు అక్షరాలేనని భావిస్తారు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెప్పినదెవరంటూ దేవతలను తిట్టడం మొదలు పెడతారు. తమని శాపనార్థాలు పెట్టే ఆ దృశ్యాన్ని ఇంద్రుడు నేరుగా చూస్తాడు. అప్పుడు ఆయన ఏం