
Save The Tigers Season 3: డిజిటల్ స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. భార్యాబాధితులైన ముగ్గురు స్నేహితుల కథగా సాగిన ఈ సిరీస్, ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ జూన్ 19 నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సరికొత్త సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. గత సీజన్ల కంటిన్యూయేషన్‌గా ఈ కథ మొదలవుతుంది. గంటా రవి (ప్రియదర్శి) భార్య హైమా (సుజాత) పోరు పడలేక గేటెడ్ కమ్యూనిటీకి మారడమే కాకుండా, రాజకీయాల్లో ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. ఇక రైటర్‌గా బిజీ అయిన రాహుల్ (అభినవ్) అవార్డులతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు. మరోవైపు విక్రమ్ (కృష్ణ చైతన్య) హారిక అనే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూసి, అతని భార్య రేఖ విడాకుల నోటీసు పంపుతుంది. read also: Samantha: తల్లి కాబోతున్న సమంత ?.. నెట్టింట బేబీ బంప్ ఫొటోలు వైరల్! ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు మిత్రులు తప్పుడు దారులు పడతారు. రవి భూకబ్జాలకు పాల్పడటం, రాహుల్ కథలు కాపీ కొట్టడం, విక్రమ్ అమ్మాయిలను వేధించడం వంటి కారణాల వల్ల ముగ్గురిపై పోలీస్ కేసులు నమోదవుతాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఒక క్లబ్ లో మందు కొడుతూ సమావేశమవుతారు. ఈ క్రమంలోనే ‘పెళ్లి’ అనే బంధం వల్లే తమ బతుకులు ఇలా అయ్యాయని, అసలు పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెప్పిన దేవతలను తిట్టడం మొదలుపెడతారు. భూలోకంలో ఈ ముగ్గురు పెడుతున్న శాపనార్థాలను ఇంద్రలోకంలో ఉన్న దేవేంద్రుడు నేరుగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు వీరికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు? అనేదే మిగతా కథ. మొదటి రెండు భాగాలు పూర్తిగా