స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా
Actor ProfileActor

స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా
Chitrajyothy7 Aug 2026
స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా

అరుంధతిగా భయపెట్టినా.. దేవసేనగా రాజసం చూపించినా.. భాగమతిగా మెప్పించినా.. అది కేవలం ఆమెకే చెల్లింది. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చూస్తుండగానే తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది స్వీటీ అనుష్క శెట్టి. అరుంధతిగా భయపెట్టినా.. దేవసేనగా రాజసం చూపించినా.. భాగమతిగా మెప్పించినా.. అది కేవలం ఆమెకే చెల్లింది. ‘సూపర్’ (Super Movie) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చూస్తుండగానే తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది స్వీటీ అనుష్క శెట్టి (Sweety Anushka Shetty). లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకుంటూ వస్తోంది. ‘బాహుబలి 2’ (Bahubali 2) లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత అందరి కెరీర్‌ జెట్‌ స్పీడ్‌లో వెళ్తుంటే, స్వీటీ జోరు మాత్రం బాగా తగ్గిపోయింది. ఇక త్వరలో టాలీవుడ్‌కు పూర్తి స్థాయిలో గుడ్‌బై చెప్పనుందనే టాక్‌ కూడా బలంగా వినిపిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ హీరోయిన్‌కు దక్కని రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది అనుష్క. అలాంటి చారిత్రక విజయం తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అందరూ ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆమె సినిమాల వేగం పూర్తిగా తగ్గిపోయింది. గతేడాది ‘ఘాటి’ సినిమాలో తనదైన మార్క్ చూపించిన స్వీటీ.. ప్రస్తుతం మలయాళంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘కథనార్’ చిత్రంతో బిజీగా ఉంది. ఒక పక్క సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆమె మునుపటిలా యాక్టివ్‌గా లేరన్నది మాత్రం వాస్తవం. సినిమా ప్రమోషన్స్‌కు మినహా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. ఈ మధ్య కాలంలో అనుష్కను పబ్లిక్ ఈవెంట్స్‌లో చూడటం కష్టంగా మారిపోయింది. మీడియా ఇంటరాక్షన్స్‌కు, ఇంటర్వ్యూలకు ఆమె వీలైనంత దూరంగా ఉంటున్నారు. అసలు స్వీటీని బయట చూడటం అసాధ్యం అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అభిమానులు కూడా తమ అభిమాన నటిని