
బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక బసప్పక్యాంప్‌లో ఎన్నో ఏళ్లుగా రహదారి లేకపోవడంతో వార్డు సభ్యులు బాలి కనకరత్నం చొరవతో సీసీ రోడ్డు మంజూరైంది. ఈ సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయక్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సహకారం అందిస్తున్నారని దీంతో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, వార్డు సభ్యురాలు కనకరత్నం, మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, రత్నారెడ్డి, 13, 17, 4వ వార్డు సభ్యులు పోతిరెడ్డి నవ్య అశోక్, వారాల రామకృష్ణ, పిల్లి గౌరి, బసప్ప రమేష్, అరుణ్ ప్రసాద్, లాల్‌మహ్మద్, రాము, దారం వెంకట్రామిరెడ్డి, సయ్యద్ జహంగీర్, ఖాన్, శివ, ఉస్మాన్, డొంకన లకుమాదేవి, సుజాత, ప్రియాంక, సత్యవతి, నాగలక్ష్మి, ఫాతిమా పాల్గొన్నారు