
మహాభారతం నుంచి ప్రేరణ పొందిన భారీ ఎపిక్ చిత్రం ‘కర్ణ’ ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తమిళ సూపర్‌స్టార్ సూర్య హీరోగా రకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సమస్యల వల్ల షెల్వ్ అయింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో ఈ సినిమా రీవైవ్ అయ్యే బలమైన ఊహాగానాలు వస్తున్నాయి. దర్శకుడు రకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఈ కథను చాలా సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో 2023లో సూర్య హీరోగా, జాన్వీ కపూర్ ద్రౌపది పాత్రలో భాగం వహించేలా ప్లాన్ చేశారు. ఇది సూర్య బాలీవుడ్ డెబ్యూ చిత్రంగా భారీ హైప్ సృష్టించింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని, భారీ VFX, ఏఆర్ రెహ్మాన్ సంగీతంతో మలచాలని ఆలోచన చేశారు. ‘కంగువా’ వాణిజ్య వైఫల్యం తర్వాత ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాకప్‌తో కూడా బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాదాపు 350 నుంచి 600 కోట్ల రూపాయల భారీ అంచనా బడ్జెట్ వల్ల 2024లో ఈ సినిమాను షెల్వ్ చేశారు. ఫలితంగా ఈ భారీ విజువల్ వండర్ నిలిచిపోవడంతో సినీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఫర్హాన్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ మళ్లీ చర్చల్లోకి రావడం విశేషం. సల్మాన్ ఖాన్‌కు స్క్రిప్ట్ న్యారేషన్ ఇవ్వగా, అతను సానుకూలంగా స్పందించినట్లు ట్రేడ్ సోర్సెస్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఈ సినిమా కేవలం పీరియడ్ ఫిల్మ్‌గా కాకుండా, కర్ణుని జీవితం, సంఘర్షణలు, వీరత్వం ఆధారంగా భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ ఖాన్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి అయ్యాక, ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి తర్వాత మొదలవ్వొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఈ