సూర్య 47’లో మోహన్ లాల్..?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Actor ProfileActor

సూర్య 47’లో మోహన్ లాల్..?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూర్య 47’లో మోహన్ లాల్..?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Eenadu20 Jun 2026
సూర్య 47’లో మోహన్ లాల్..?క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఇంటర్నెట్ డెస్క్: నటుడు సూర్య హీరోగా జితూ మాధవన్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సూర్య 47’వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటిస్తున్నారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. అలాగే మోహన్ లాల్ పాత సినిమాలోని ఒక పాటను ఇందులో యాక్షన్ సీన్ కోసం వాడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో జితూ మాధవన్ మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పందించారు. ‘ఈ సినిమాలో మోహన్‌ లాల్‌ లేరు. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉంది. సరైన సమయంలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తాం’ అని స్పష్టం చేశారు. అయితే మోహన్‌లాల్ పాత సినిమాలోని ఓ పాటను యాక్షన్ సీక్వెన్స్‌లో ఉపయోగిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. యాక్షన్ కామెడీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా, నస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం 2027 పొంగల్‌కు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా షూటింగ్ జూన్ చివరి నాటికి పూర్తవుతుందని నస్లెన్ ఇటీవల తెలిపారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో కనిపించనున్నారు. మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 14న విడుదల కానుంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు