
సూర్య(Suriya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ జీతూ మాధవన్(Jeethu Madhavan)తో చేస్తున్న సినిమా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్య 47(Suriya47)గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు శరవేడి(Saravedi) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ పేరు అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో వరుస విజయాలు అందుకున్న జీతూ మాధవన్‌కు ఇది తొలి తమిళ దర్శకత్వ సినిమా కావడం విశేషం. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అంశాలను సమతూకంగా మేళవిస్తూ డైరెక్టర్ తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయి. ఇక సంగీత బాధ్యతలను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్(Sai Abhyankar) నిర్వహిస్తున్నాడు.మరోవైపు సూర్య ఇప్పటికే విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & sons) షూటింగ్ పూర్తి చేసి, ఆ సినిమాను ఆగస్టు 14న విడుదలకు సిద్ధం చేశారు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న సూర్య సినిమా ఇదే కావచ్చని, త్వరలోనే టైటిల్‌తో పాటు మరిన్ని అధికారిక అప్‌డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం