
కోల్‌కతా: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నేతలను కాదని సినిమా తారలను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తగిన శాస్తి జరిగిందని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గుర్తించాలని కోరుతున్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఎన్డీఏ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అధినేత్రి తీరుపై పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా సయోనీ ఘోష్ (Saayoni Ghosh).. రెబల్ ఎంపీల వర్గంలో చేరడం టీఎంసీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గుణపాఠం నేర్పారు మమతా బెనర్జీకి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సయోనీ ఘోష్.. టీఎంసీని వీడతారని ఊహించలేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. స్థాయికి మించి అవకాశాలు కల్పించినా ఆమె పార్టీని వీడడం జీర్ణించుకోలేపోతున్నామని చెబుతున్నారు. “సయోనీ ఘోష్ రెబల్ వర్గంలో చేరుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఆమెను అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాయకురాలిగా ఎదిగే అవకాశం కల్పించారు. ఇది మమతా, అభిషేక్‌లకు కూడా ఒక పాఠం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతల కంటే సినీ రంగం నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచారు” అని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. మహువా మెయిత్రా భావోద్వేగం పార్టీని వీడి, రెబల్ గ్రూపు ఎంపీలతో సయోనీ ఘోష్ చేతులు కలపడం తనను బాధించిందని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా వ్యాఖ్యానించారు. “సయోనీ నాకు చెల్లెలిలాంటిది, కూతురితో సమానం. ఆమె పార్టీని విడిచిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఎంతో కష్టపడి ఎదిగింది. డబ్బు కోసం లేదా వ్యక్తిగత లాభం కోసం పనిచేసే వ్యక్తి కాదు. గత ఐదేళ్లలో పార్టీ ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి వ్యక్తి పార్టీని వీడాలని ఆలోచించడం చాలా బాధాకరం