
రుద్రంపూర్, జూన్ 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదర్శ రైతు సాయిని మధుసూదన్ రావుకు ఉత్తమ రైతు అవార్డు లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. సాయిని మధుసూదన్ రావు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే “రైతులకు నేస్తం” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతో పాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేయనున్న కొత్త వంగడాలు, చిరుధాన్య పంటల సాగు విధానాలు, నూతన వ్యవసాయ సాంకేతికతలను తన పొలంలో అమలు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించడం జిల్లాకు గర్వకారణమని పలువురు రైతులు, వ్యవసాయ అధికారులు పేర్కొంటూ అభినందనలు తెలిపారు