మలయాళ నటుడు బాల తనలోని దాతృత్వాన్ని చాటుకుంటూ ఒక వృద్ధుడికి సాయం చేసే క్రమంలో కొనుగోలు చేసిన లాటరీ టికెట్లు ఆయనకు ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, ఆయన కొనుగోలు చేసిన నాలుగు 'స్త్రీ శక్తి' లాటరీ టికెట్లకూ బహుమతులు లభించడం విశేషం. ఈ సంతోషకరమైన విషయాన్ని బాల స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.తన ఫామ్‌హౌస్ నుంచి ఎర్నాకుళం వెళుతుండగా, దారిలో ఒక వృద్ధుడు లాటరీ టికెట్లు విక్రయించడాన్ని బాల గమనించారు. ఆ వయసులోనూ ఆయన పడుతున్న శ్రమను చూసి చలించిపోయిన బాల, గెలుపుపై ఆశతో కాకుండా కేవలం ఆ వృద్ధుడికి ఆర్థికంగా అండగా నిలవాలనే సదుద్దేశంతో నాలుగు టికెట్లు కొనుగోలు చేశారు. "నేను లాటరీ గెలవాలని ఈ టికెట్లు కొనడం లేదు, కేవలం మీకోసమే కొంటున్నాను" అని ఆ వృద్ధుడితో అన్నట్లు బాల తన పోస్టులో పేర్కొన్నారు.అయితే అనూహ్యంగా, లాటరీ ఫలితాలను పరిశీలించగా ఆయన కొన్న నాలుగు టికెట్లకూ బహుమతులు లభించాయి. "వచ్చిన నగదు మొత్తం స్వల్పమే అయినప్పటికీ, నేను కొనుగోలు చేసిన నాలుగు టికెట్లకూ బహుమతులు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది" అని బాల వివరించారు. "మీరు కచ్చితంగా గెలుస్తారు" అని టికెట్లు విక్రయించిన ఆ వృద్ధుడు చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఇదంతా దైవానుగ్రహంగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.బాల కుటుంబానికి లాటరీ అదృష్టం వరించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆయన భార్య కోకిల కూడా 'కారుణ్య' లాటరీలో రూ. 25,000, 'భాగ్యతార' లాటరీలో
Actor ProfileActor
సాయం చేద్దామని లాటరీ కొంటే.. కొన్న నాలుగు టికెట్లకూ బహుమతులు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
AP7AM•4 Aug 2026
సాయం చేద్దామని లాటరీ కొంటే.. కొన్న నాలుగు టికెట్లకూ బహుమతులు