సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్ చేయాల్సిందే
Actor ProfilePolitician

సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్ చేయాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్ చేయాల్సిందే
Zee Telugu2 Jul 2026
సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్ చేయాల్సిందే

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ambati Rambabu: 'సీబీఐ దర్యాప్తుతోనే నిజానిజాలు నిగ్గు తేలుతాయి. విజయవాడ సీపీ పాత్రపై అడుగడుగునా అనుమానాలు ఉన్నాయి. పోలీస్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తేనే విచారణ ముందుకు వెళ్తుంది' మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. లోపభూయిష్టంగా సీఐ నాగరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారని.. సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చింది టాస్క్‌ఫోర్స్‌. ఎవరి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ పని చేశారు? ఎన్‌బీడబ్ల్యూ ఉంటే కోర్టులో ఎందుకు హాజరుపర్చలేదు?' అని ప్రశ్నించారు. విజయవాడ పోలీసుల చేతిలో చనిపోయిన గాదె సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబును సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అసలు సాయికృష్ణను తీసుకురావాలని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను మార్కాపురం పంపింది ఎవరో తేల్చాలని కోరారు. ఈ కేసులో నాగరాజుతో పాటు చాలా మంది పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. చాలా దురదృష్టకరం తాడేపల్లిలోని వైఎసార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం' అని తెలిపారు. కొట్టారు, చంపేశారు. ఇక్కడ ఉద్దేశం ఏంటనేది దర్యాప్తులో తేలాలి. సాక్ష్యాధారాలు లేకుండా డెడ్‌ బాడీని బూడిద చేశారనే ఆరోపణలు ఉన్నాయి' అని వివరించారు. ఇలా దేశ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదనేది తన అభిప్రాయం అని అంబటి రాంబాబు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన