సాయికృష్ణ కేసు.. జులై 6కి విచారణని వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
Actor ProfilePolitician

సాయికృష్ణ కేసు.. జులై 6కి విచారణని వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సాయికృష్ణ కేసు.. జులై 6కి విచారణని వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
Andhra Jyothy12 Jul 2026
సాయికృష్ణ కేసు.. జులై 6కి విచారణని వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. అమరావతి, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు (Gade Sai Krishna Case) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (PIL) పై ఈరోజు (బుధవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు దర్యాప్తు పురోగతిని వివరించారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు కోసం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ఏజీ ధర్మాసనానికి తెలిపారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా, సక్రమంగా సాగేందుకు ప్రభుత్వం అన్నిరకాల కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ రోజే (బుధవారం) ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు.. సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏం చేస్తారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణలో సీఐ నాగరాజు నోరు విప్పని నేపథ్యంలో, ఆయన అరెస్ట్ కావడం, కోర్టు ముందు హాజరుపరుస్తుండటంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం కులాలు, మతాల మధ్య చిచ్చు

స య క ష ణ క స జ ల 6క వ చ రణన వ య ద వ స న ఏప హ క ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in