.webp)
విజయవాడలో సాయికృష్ణ తల్లిని పరామర్మించిన వైఎస్ జగన్... విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చిన జగన్, ఈ దారుణ ఘటనపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైఎస్ జగన్, పోలీసుల వేధింపుల వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ఒక సాధారణ యువకుడిని మే నెలలోనే పోలీసులు తీసుకువెళ్లారని, అతని ఆచూకీ కోసం తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కనీస సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పైగా, "నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో" అంటూ పోలీసులు అమానవీయంగా సమాధానం చెప్పడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బంది పాత్రే కాకుండా, పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానాలను వైఎస్ జగన్ వ్యక్తపరిచారు. విజయవాడ సీపీ, ఏసీపీలతో పాటు డీజీపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణలంక ప్రాంతంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటాయని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ ఇలాంటి వేధింపుల ఉదంతాలు వెలుగుచూశాయని జగన్ గుర్తుచేశారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే మరో యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఒకే అధికారి వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలన్నారు. పోలీసుల లాకప్ డెత్ లపై ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై అటు రాజకీయ
