స మంత .. సరికొత్త చరిత్ర! ఇప్ప టి వ ర కు లేరు.. ఇక
Actor ProfileActor

స మంత .. సరికొత్త చరిత్ర! ఇప్ప టి వ ర కు లేరు.. ఇక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స మంత .. సరికొత్త చరిత్ర! ఇప్ప టి వ ర కు లేరు.. ఇక పై క
Chitrajyothy25 Jun 2026
స మంత .. సరికొత్త చరిత్ర! ఇప్ప టి వ ర కు లేరు.. ఇక పై క

సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). జూన్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం మొదటి రోజే సాలిడ్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ సాధిస్తూ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతుండగా, మరోవైపు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ లభిస్తోంది. సమంత క్రేజ్, నందిని రెడ్డి మేకింగ్ స్టైల్ సినిమాకు ఈ స్థాయి భారీ వసూళ్లు రావడానికి ప్రధాన కారణాలని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో సమంతకు ఉన్న తిరుగులేని మార్కెట్‌ను ఈ సినిమా మరోసారి నిరూపించింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అత్యధికంగా 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా ఇప్పటికే సమంత పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆమె ఖాతాలో ఏకంగా 16 వన్ మిలియన్ డాలర్ సినిమాలు ఉండగా, ‘మా ఇంటి బంగారం’ కూడా ఈ ఆదివారం ముగిసే సమయానికి చాలా సులువుగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 17 చిత్రాలతో వన్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఏకైక నటిగా సమంత తన