స మంత ప్రెగ్నెంట్ అని అప్పుడే తెలుసు
Actor ProfileCelebrity

స మంత ప్రెగ్నెంట్ అని అప్పుడే తెలుసు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స మంత ప్రెగ్నెంట్ అని అప్పుడే తెలుసు
Telugu Times25 Aug 2026
స మంత ప్రెగ్నెంట్ అని అప్పుడే తెలుసు

మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)తో భారీ విజయాన్ని అందుకున్న సమంత(Samantha) ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో తాను గర్భవతినని సమంత స్వయంగా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ విషయం సినిమా షూటింగ్ సమయంలోనే తనకు తెలిసిందని డైరెక్ట‌ర్ నందిని రెడ్డి(Nandini Reddy) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా తస్సాదియ్యా సాంగ్ షూటింగ్ టైమ్ లో జరిగిన సంఘటనలను ఆమె గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక సమంత ఆరోగ్యం బాగోలేదని తనకు సమాచారం వచ్చిందని నందిని రెడ్డి తెలిపారు. సాధారణంగా సమయానికి సెట్స్‌కు వచ్చే సమంత ఆలస్యంగా రావడంతో పరిస్థితి ఏంటో అడిగానని చెప్పారు. మొదట నాలుగు రోజుల్లో పూర్తి చేయాలనుకున్న పాటను రెండు రోజుల్లో ముగించగలమా అని యూనిట్ అడిగిందని, మరుసటి రోజు సమంత తనతో మాట్లాడుతుండగా తాను గర్భవతినని చెప్పిందని వెల్లడించారు. ఆ క్షణంలో తాను పూర్తిగా షాక్‌కు గురయ్యానని, అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని సమంత కోరిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత షూటింగ్ మొత్తం సమంతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు నందిని రెడ్డి వివరించారు. డాన్స్ మాస్టర్‌కు ఎక్కువ రిహార్సల్స్ చేయించవద్దని సూచించానని, టేక్ సమయంలో మాత్రమే పూర్తి ఎనర్జీ ఇవ్వాలని ప్లాన్ చేశానన్నారు. ఎప్పుడైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే చెప్పాలని సమంతకు సూచించినట్లు చెప్పారు. అలాగే కార్ ఛేజ్ సీన్స్ ను కూడా తీవ్రమైన ఎండ తగ్గిన తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల త‌ర్వాత‌ మాత్రమే చిత్రీకరించేలా షెడ్యూల్ మార్చినట్లు వెల్లడించారు. సమంత ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని షూటింగ్ నిర్వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా భావించానని నందిని రెడ్డి పేర్కొన్నారు