సంబరాల యేటిగట్టు.. ఇంకా ఎంత కాలం ఎదురుచూపులు
Actor ProfileActor

సంబరాల యేటిగట్టు.. ఇంకా ఎంత కాలం ఎదురుచూపులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సంబరాల యేటిగట్టు.. ఇంకా ఎంత కాలం ఎదురుచూపులు
Telugu Times2 Jul 2026
సంబరాల యేటిగట్టు.. ఇంకా ఎంత కాలం ఎదురుచూపులు

సాయిధరమ్ తేజ్(Sai dharam Tej) హీరోగా తెరకెక్కుతున్న సంబరాల యేటిగట్టు(Sambarala Yeti Gattu) సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. దాదాపు రెండేళ్ల క్రితం భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను హనుమాన్(Hanuman) నిర్మాత నిరంజన్ రెడ్డి(Niranjan reddy) నిర్మిస్తుండగా, డెబ్యూ డైరెక్ట‌ర్ రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ఈ సినిమాను గతేడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆ ప్లాన్స్ అమలు కాలేదు. అప్పటి నుంచి సినిమా పురోగతిపై అధికారిక సమాచారం కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇదే సమయంలో సినిమా బడ్జెట్‌పై పలు రకాల ప్రచారాలు వినిపించాయి. మొదట అనుకున్న వ్యయాన్ని దాటి వంద కోట్లకు పైగా ఖర్చయిందని, సినిమా మార్కెటింగ్ మరియు రికవరీ విషయంలో నిర్మాత ఆందోళన చెందుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. సినిమా నుంచి కొత్త పోస్టర్, టీజర్ లేదా రిలీజ్ అప్‌డేట్ కూడా లేకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మెగా అభిమానులు సినిమా అసలు స్థితిగతులపై క్లారిటీ కోరుతున్నారు. తాజాగా హనుమాన్ 3డీ(Hanuman 3D) రిలీజ్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్‌కు ఇదే అంశంపై ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అభిరుచి మారిందని, ఇప్పుడు సాధారణ కంటెంట్‌తో వారిని మెప్పించడం కష్టమైందని ఆయన పేర్కొన్నాడు. అందుకే మరింత క్వాలిటీ సినిమాను అందించేందుకు సమయం తీసుకుంటున్నామని చెప్పాడు. అయితే సినిమా పూర్తయిందా, ఇంకా ఎంత పని మిగిలి ఉంది, రిలీజ్ ఎప్పుడ‌నే కీలక విషయాలపై మాత్రం తేజు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సంబరాల యేటిగట్టు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల సందేహాలు అలాగే కొనసాగుతున్నాయి