
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న భారీ స్పందనతో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ నెలకొంది. పాన్-ఇండియా సంచలనం ‘హనుమాన్’ను అందించిన ఈ నిర్మాణ సంస్థ, అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. భారీ సెట్ల నుండి అత్యున్నత సాంకేతిక ప్రమాణాల వరకు, నిర్మాతలు రాజీపడకుండా గొప్ప విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు నాంది పలుకుతూ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించింది. అత్యంత అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలకు జీవం పోయడానికి, ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను గ్రాండ్ గా నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన ఘట్టాలు ఉంటాయి, ఇది ఒక మరపురాని సినిమా ఎక్స్ పీరియన్స్ కి వేదిక కానుంది. సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ పాత్రలలో కనిపించబోతున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన సాయి తేజ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఇది ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని మాస్ అప్పీల్‌తో కూడిన సినిమాని ప్రామిస్ చేస్తోంది. దర్శకుడు రోహిత్ కేపీ ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ కథనం, ఉత్కంఠభరితమైన విజువల్స్, హై-ఆక్టేన్ సన్నివేశాల మేళవింపుతో ఒక గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. విభిన్న ప్రదేశాలలో పలు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశలోకి ప్రవేశించింది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభం