సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Actor ProfilePolitician

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Total News2
Movie Updates0
Sources1
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Vaartha13 Jun 2026
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Heavy Rain : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Vaartha13 Jun 2026
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Cyber Crime: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి, చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్న ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరిట వచ్చిన ఒక నకిలీ సందేశాన్ని నమ్మడమే ఆ యువకుడు చేసిన పాపమైంది. కూలీ పనిచేసే తండ్రికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్న ఆ కుమారుడు, ఇలా సైబర్ క్రైమ్ బాధితుడిగా మారి అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు రోషన్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితమే తల్లి మరణించడంతో, తండ్రి వెంకటేష్ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూలీ పనులు చేస్తూ కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. తండ్రి పడుతున్న శ్రమను కళ్లారా చూసిన రోషన్, చదువుకుంటూనే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేసి ఆర్థికంగా సహాయపడాలని అనుకున్నాడు. Read also: KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. సిరిసిల్ల వేదికగా ఘాటు వ్యాఖ్యలు ఈ క్రమంలోనే రోషన్ మొబైల్‌కు ‘ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదించవచ్చు’ అంటూ ఒక ఫేక్ మెసేజ్ వచ్చింది. దాన్ని నిజమేనని నమ్మిన ఆ విద్యార్థి, సైబర్ నేరగాళ్లు గీసిన వలలో చిక్కుకున్నాడు. టాస్క్‌ల పేరుతో వారు అడిగినట్లు విడతల వారీగా సుమారు రూ. 30,000 వరకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఎంత సంప్రదించినా అవతలి వైపు నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో తాను మోసపోయానని రోషన్‌కు అర్థమైంది. తండ్రి ఎంతో కష్టపడి దాచిన సొమ్మును ఆన్‌లైన్ దొంగల పాలు చేశాననే అపరాధ భావం, తీవ్ర మనస్తాపం అతన్ని వెంటాడాయి. దీంతో ఇంట్లో ఎవరూ లేని