సీబీఎన్ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

సీబీఎన్ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Total News1
Movie Updates0
Sources1
సీబీఎన్ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Eenadu16 Jun 2026
సీబీఎన్ 361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఇంటర్నెట్‌డెస్క్‌: సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి.నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని ‘రేపటి కోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. దీనిని విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిల్యాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాడ్‌ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఏపీ అభివృద్ధికి విజన్‌ల రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో తీసుకుంటోన్న శ్రద్ధ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని రచయిత వివరించారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్‌ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలను సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకంలో ఆవిష్కరించినట్టు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కాకతీయ కల్చరల్ అసోసియేషన్.. ముఖ్యమంత్రిని గ్లోబల్ పాలీమ్యాథ్ అవార్డుతో సత్కరించింది. సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణేన్ని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకం తెలుగు, హిందీ సహా వివిధ భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెరా మాజీ చైర్మన్ రామనాథ్, కేవీ సత్యనారాయణ, శంకర ప్రసాద్, సింగపూర్‌లోని తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త