సూపర్ సుబ్బు’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Actor ProfileActor

సూపర్ సుబ్బు’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Total News1
Movie Updates0
Sources1
సూపర్ సుబ్బు’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Eenadu15 Jun 2026
సూపర్ సుబ్బు’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌ ‘సూపర్‌ సుబ్బు’ (Super Subbu). సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan), మిథిలా పాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్ డేట్‌ వచ్చేసింది. జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వీడియో విడుదల చేసింది. ‘‘ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం’’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో సుబ్బు (సందీప్‌ కిషన్‌)ను చంపేందుకు గ్రామస్థులు వెంటపడగా.. అతడు పారిపోతున్న దృశ్యాలు సిరీస్‌పై ఆసక్తి రేకెత్తించాయి. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేలా కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు మల్లిక్‌ రామ్‌ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జాబ్‌ పర్మినెంట్‌ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఇది రూపొందింది. సందీప్‌ కిషన్‌కు తండ్రిగా మురళీశర్మ నటించారు. బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు