సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్
Actor ProfileActor

సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్
10TV Telugu4 Sept 2026
సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ.. సె క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్

Super Subbu Review : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మిథిలా పాల్కర్, మానస చౌదరి, మురళీశర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేడు జూలై 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో నెట్ ఫ్లిక్స్ కి ఇదే మొదటి ఒరిజినల్ సిరీస్ కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మారుమూల గ్రామం మాకిపూర్. అక్కడి జనాలకు సె*క్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహనా లేకపోవడం, అక్కడ మహిళలకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో జనాభా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ ఊళ్ళో పిల్లలు పుట్టించడం తగ్గించాలని అక్కడి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ని పంపించినా ఆ ఊళ్ళో మగవాళ్ళు భయపెట్టి కొట్టి పంపిస్తూ ఉంటారు. చాలా పద్ధతి, స్ట్రిక్ట్ రిటైర్డ్ లెక్కల టీచర్ కుక్కుటేశ్వరరావు(మురళీశర్మ) కొడుకు సుబ్బు(సందీప్ కిషన్). తండ్రికి భయపడుతూ బొమ్మరిల్లు కొడుకులా బతుకుతూ ఓ గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్ టీచర్ గా టెంపరరీ జాబ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పట్నుంచి తన తప్పు లేకుండానే అనుకోకుండా ఏదో ఒక సంఘటనల వల్ల సుబ్బుపై కుక్కుటేశ్వరరావుకు మంచి అభిప్రాయం ఉండదు. సుబ్బుకు దివ్య(మానస చౌదరి)తో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అనుకోకుండా స్కూల్ లో జరిగిన ఓ సంఘటన తన తండ్రికి తెలియకూడదు అని ప్రిన్సిపాల్(బ్రహ్మానందం)ని బతిమాలడంతో మాకిపూర్‌కి సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా వెళ్ళమంటాడు. దీంతో సుబ్బు అక్కడికి వెళ్తాడు. అసలు ఆ పదం వింటేనే తిట్టే తండ్రికి ఈ జాబ్ చేస్తున్నట్టు తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ ఉంటాడు సుబ్బు. ఇక ఆ ఊర్లో ఆ పేరు ఎత్తినా, కండోమ్ వాడమన్నా, మహిళలకు అవగాహన కలిపించినా రమేష్(జీవన్ కుమార్), అతని మనుషులు అందరూ సుబ్బు పైకి