సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ .. ఆ సినిమా
Actor ProfileActor

సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ .. ఆ సినిమా

Total News1
Movie Updates0
Sources1
సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ .. ఆ సినిమా
Asianet News Telugu15 Jun 2026
సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ .. ఆ సినిమా

సూపర్‌ స్టార్‌ కృష్ణ 1960 నుంచి సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన హీరోగా కెరీర్‌ పీక్‌ చూసినప్పుడు చిరంజీవి కనీసం ఇండస్ట్రీలో కూడా లేరు. 1980 నుంచి చిరంజీవి నటుడిగా జర్నీ స్టార్ట్ చేసి మూడేళ్లలోనే స్టార్‌ అయిపోయాడు. 1990 టైమ్‌లో కెరీర్‌లో పీక్‌ని చూశారు. ఆ సమయంలో కృష్ణ కూడా తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణించారు. అయితే కృష్ణ చేయాల్సిన ఒక సినిమా రామ్‌ చరణ్‌ చేయడం విశేషం. సూపర్‌ స్టార్‌ రిజెక్ట్ చేసిన మూవీతో చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌ని కొట్టాడు. రికార్డులు తిరగరాశారు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌కి కొత్త మైల్‌ స్టోన్‌ని సెట్‌ చేశారు. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటనేది చూస్తే. రామ్‌ చరణ్‌.. `చిరుత` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు చరణ్‌. ఆ తర్వాత `మగధీర`తో పెద్ద హిట్‌ని అందుకున్నాడు. 2009లో విడుదలైన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. దీనికి విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటించగా, శ్రీహరి కీలక పాత్ర పోషించారు. పునర్జన్మల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది వంద కోట్లకుపైగా వసూలు చేసింది. టాలీవుడ్‌లో వంద కోట్లు దాటిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ సూపర్‌స్టార్‌ కృష్ణ చేయాల్సింది. 1996లో కృష్ణ `జగదేక వీరుడు` అనే సినిమా చేశాడు. ఇందులో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. సాగర్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి మొదట అనుకున్న కథ వేరు. అదే `మగధీర` కథ. ఈ కథతో సినిమా చేయాలని భావించారు. విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. కానీ కృష్ణతోపాటు వారి టీమ్‌కి ఈ కథ పెద్దగా నచ్చలేదట. ఇది వర్కౌట్‌ కాదని చెప్పి పక్కన పెట్టారట. వేరే కథతో