
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold- Silver Price Drop: బంగారం, వెండి ధరలు తమ ఆకర్షణను కోల్పోతున్నాయి. పెరుగుట విరుగటకే అన్నట్లుగా ఈ ఏడాది జనవరిలో 1.90లక్షలకు చేరుకున్న బంగారం ధర అదే స్థాయిలో తగ్గుతూ వస్తుంది. వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపు 2 లక్షల మేర పతనం అయ్యింది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ముగిసిపోవడం, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల జూన్ లో ఈ విలువైన లోహాల ధరలు వరుసగా16000 వేలు బంగారం, 33,000 వెండి తగ్గింది. అయితే ఈ తగ్గుదల ఇక్కడితో ఆగదని నిపుణులు అంటున్నారు. రాబోయే మూడు రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారీగా తగ్గే అవకాశం ఉంది. బంగారం ధర రూ.1,00,000 కంటే దిగువకు పడిపోవచ్చని.. వెండి ధర రూ.1.90 లక్షలకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పతనానికి నిపుణులు 4 ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. ఈ భారీ తగ్గుదల గురించి, దేశంలోని ప్రముఖ కమోడిటీ నిపుణులు అనుజ్ గుప్తా, అజయ్ కేడియా ఏమంటున్నారో తెలుసుకుందాం. 1. వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్ సన్నాహాలు: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, బ్రోకరేజ్ విభాగమైన బోఫా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఫెడరల్ రిజర్వ్ ఈ త్రైమాసికంలో సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచుతుంది. దీనితో ప్రామాణిక రేటు ప్రస్తుత 3.5శాతం–3.75శాతం శ్రేణి నుండి 4.25శాతం–4.5శాతంకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని పెంచి, ధరలు మరింత తగ్గేందుకు కారణం అవుతాయని చెబుతున్నారు. 2. ఏడాది గరిష్ఠానికి చేరిన డాలర్ సూచీ: ప్రధాన