సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టు విప్పిన స్టార్ హీరోయిన్
Actor ProfileActor

సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టు విప్పిన స్టార్ హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టు విప్పిన స్టార్ హీరోయిన్
Zee Telugu22 Jul 2026
సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టు విప్పిన స్టార్ హీరోయిన్

Kajal Aggarwal Retirement: ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ చిత్ర పరిశ్రమకు వీడ్కోలు పలకనున్నారట. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శాశ్వతంగా గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోయిన్‌గా 20 ఏళ్ల పాటు సక్సెస్‌ఫుల్ కెరీర్ ఆమె ముగింపు పలకబోతున్నట్లు చిత్రసీమలో అనేక వదంతులు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు అభిమానులకు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. తాను సినిమాలను వదిలిపెట్టడం లేదని, కుటుంబాన్ని, కెరీర్‌ను రెండింటినీ సమతుల్యం చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును 2020లో వివాహం చేసుకున్న కాజల్, 2022లో కుమారుడు 'నీల్'కు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వ బాధ్యతలను ఆస్వాదిస్తూనే, నటనను కూడా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పంచుకున్న కొన్ని భావోద్వేగపూరిత విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. "మా అబ్బాయి ఎప్పుడూ నేను తనతోనే ఉండాలని కోరుకుంటాడు. నేను షూటింగ్‌కు వెళ్లడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. నేను మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నన్ను ఎంతో మిస్ అవుతాడు" అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఒక తల్లిగా, నటిగా రెండు భిన్నమైన బాధ్యతలను నిర్వహించడం అనేది చాలా క్లిష్టమైన పని అయినప్పటికీ.. సరైన ప్లానింగ్‌తో దాన్ని సుసాధ్యం చేస్తున్నానని కాజల్ తెలిపారు. ముఖ్యంగా తన భర్త గౌతమ్ కిచ్లు, అలాగే కుటుంబ సభ్యుల నుంచి లభిస్తున్న అపారమైన మద్దతు వల్లే తాను కెరీర్‌లో ముందుకు సాగగలుగుతున్నానని ఆమె కృతజ్ఞత భావాన్ని చాటారు. తల్లి అయిన తర్వాత తనలో సహనం, ప్రేమ, బాధ్యతా భావం మరింత పెరిగాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా