సినిమాలు లేకపోయినా అలా సంపాదిస్తా.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Actor ProfileActor

సినిమాలు లేకపోయినా అలా సంపాదిస్తా.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినిమాలు లేకపోయినా అలా సంపాదిస్తా.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Telugu3 Sept 2026
సినిమాలు లేకపోయినా అలా సంపాదిస్తా.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telugu actress:సినీ పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తగ్గిపోతాయో చెప్పడం కష్టం. అందుకే ఈ రోజుల్లో చాలా మంది నటీనటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా ఆదాయం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్లు, సోషల్ మీడియా వంటి వేదికలను వినియోగించుకుంటూ తమ కెరీర్‌ను మరింత బలంగా మార్చుకుంటున్నారు. తాజాగా నటి రాశీ సింగ్ కూడా ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశీ సింగ్ మొదట ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. తర్వాత సినిమాలపై ఆసక్తితో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శశి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, ఆ తర్వాత ప్రేమ్ కుమార్, ప్రసన్న వదనం, భూతద్దం భాస్కర్ నారాయణ, బ్లైండ్ స్పాట్, పాంచ్ మినార్, సంతాన ప్రాప్తిరస్తు, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వంటి చిత్రాల్లో నటించారు. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ తెలుగు భాషను నేర్చుకుని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా ఆమె మంచి గుర్తింపు సంపాదించారు. పాపం పసివాడు, త్రీ రోజెస్ వంటి వెబ్ సిరీస్‌లలో విభిన్న పాత్రలు పోషించారు. తెరపై సాధారణ పాత్రల్లో కనిపించినా, నిజ జీవితంలో మాత్రం స్టైలిష్‌గా ఉంటారని అభిమానులు చెబుతుంటారు. నటనతో పాటు రాశీ సింగ్ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. రెస్టారెంట్, కేఫే వ్యాపారాలను నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. సినిమాలు మాత్రమే కాదు, ఇతర రంగాల్లో కూడా ముందుకు వెళ్లాలని ఆమె ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశీ సింగ్ సోషల్ మీడియా గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ మంచి ఆదాయ వనరుగా మారిందని ఆమె చెప్పారు. నటీనటులు మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా బ్రాండ్ ప్రమోషన్లు, ప్రకటనలు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ను సినిమాలకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని ఆమె స్పష్టం చేశారు. ఒక నటిగా మంచి కథలు