
రాజమౌళి.. ఇండియన్ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు. మన భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటారు. ఇండియన్ సినిమాకి టాలీవుడ్‌ని ఫేస్ ఆఫ్‌గా నిలిపారు. `బాహుబలి` సినిమాతోనే ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు జక్కన్న. `సింహాద్రి` నుంచి రాజమౌళి లెక్కనే మారిపోయింది. `ఛత్రపతి`, `యమదొంగ`, `ఈగ`, `మగధీర` చిత్రాలతో తనని తాను నిరూపించుకుంటూ వచ్చారు. `బాహుబలి`లో రాజమౌళి ఏంటనేది అందరికి తెలిసింది. అయితే బాహుబలి 2 ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ మూవీ రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత తీసిన `ఆర్‌ఆర్‌ఆర్` యావరేజ్‌గానే ఆడింది. ఇప్పుడు `వారణాసి` తో భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించే పనిలో ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లక్ష్యంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే `బాహుబలి` రిలీజ్ అయి తొమ్మిదేళ్లు అవుతుంది. కానీ దీని జర్నీ మాత్రం ఆగడం లేదు. గతేడాది రెండు పార్ట్ లను కలిపి రిలీజ్ చేయగా, మంచి ఆదరణ పొందింది. త్వరలో `బాహుబలి 3` కూడా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పుడు రాజమౌళి `బాహుబలిః ది టార్చ్ బేరర్` అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో `బాహుబలి` మూవీకి సంబంధించిన జర్నీని పంచుకున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, రమా రాజమౌళి, సింహ, కీరవాణి ఇలా సినిమాకి పనిచేసిన అందరు ఆ జర్నీని, మెమొరీస్‌ని పంచుకున్నారు. ఆయా విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో భాగంగా ఈ మూవీకి సంబంధించి ప్రారంభంలో వచ్చిన టాక్ గురించి చెప్పారు. `బాహుబలి` మొదటి భాగం విడుదలైనప్పుడు సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందట. ఈ విషయాన్ని చాలా సార్లు వెల్లడించారు రాజమౌళి. తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీలో కూడా అదే విషయాన్ని చెప్పారు. మొదట రోజు టాక్ ఏంటో అర్థం కాలేదని తెలిపారు. అయితే నిర్మాతలకు మాత్రం డిజాస్టర్