సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువ నటి
Actor ProfileActor

సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువ నటి

Total News1
Movie Updates0
Sources1
సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువ నటి
TV9 Telugu15 Jun 2026
సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న యువ నటి

సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుర్ర నటి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రముఖ సీరియల్స్, అలాగే సినిమాల్లో నటించిన నటి సంచిత ఉగలే కన్నుమూశారు. 30 ఏళ్ల వయసులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. సంచిత ఉగలే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. సీరియల్స్, సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంచిత ఉగలే తన నటనా జీవితాన్ని మూడేళ్ల క్రితం, 2023లో, కంటిన్యూటీ ఆర్టిస్ట్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకునేది సంచిత ఉగలే. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకున్నారు సంచిత ఉగలే. అదేవిధంగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన 800 కోట్ల చిత్రం ‘ ఛవా’లో కూడా కనిపించింది . ఆ నటి మరణంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంచిత ఉగలే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటన నిన్న సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల మధ్య జరిగింది. నలసోపారా ప్రాంతంలో సంచిత ఉగలే తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తోందని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తన చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. సంచిత ఉగలే బాడీ దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి