
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tv Actress Kumkum Bhagya fame sanchita ugale dies by suicide: ప్రముఖ బుల్లి తెర నటి సంచిత ఉగాలే ముంబైలోని నలసోపారాలో ఉన్న తన నివాసంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేవలం 30 ఏళ్ల చిన్న వయసులో ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవనంను ముగించడంపై టెలివిజన్ రంగమంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సంచితా ఉగాలే టీవీ సీరియళ్లతో పాటు పలు సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ముఖ్యంగా కుంకుమ్ భాగ్య, సాజన్ ఘర్, దిల్వాలీ దుల్హా లే జాయేగీ వంటి పలు సీరియళ్లు, మూవీస్ లతో ఒక రెంజ్ లో పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలో నటి సంచితా ఉగాలే మరణంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంచిత ఉగాలే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో సుకూన్ అనే పాత్ర ద్వారా ఆమె వెండితెర అరంగేట్రం చేశారు. ఇటీవల విడుదలైన విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రంలో ఆమె పోషించిన తారాబాయి పోషించి అందరితో మన్ననలు పొందారు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు నటిగా కూడా తన సత్తాచాటుకుంటున్నారు. ఇంతలో ఉగాలే ఈ విధంగా నిర్ణయం తీసుకొవడంపై అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్