సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని
Actor ProfileActor

సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని

Total News2
Movie Updates0
Sources1
సీరియల్ నటి ఆత్మహత్య
Chitrajyothy15 Jun 2026
సీరియల్ నటి ఆత్మహత్య

బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ నటి సంచితా ఉగాలే (Sanchitha Ugale) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడ్ టీవీ

సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని
Chitrajyothy15 Jun 2026
సినీనటికి వేధింపులు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని

టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ని అందుకుంటున్నా.. ఇంకా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు. టాలీవుడ్.. పాన్ ఇండియా రేంజ్ ని అందుకుంటున్నా.. ఇంకా క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కొత్తగా వచ్చే అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు. తమ కోరికలను తీర్చాలని, లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో ఒక సినీ నటిపై జరిగిన వేధింపుల ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్.. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి మోసం చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రసాద్.. చాలా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులను వెతకడమే అతని పని. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఆకాశంలో ఒక తార సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి ప్రసద్ ఒక నటిని సంప్రదించాడు. మంచి పాత్ర కావడంతో.. ప్రసాద్ ని నమ్మి సదరు నటి ఆ ప్రాజెక్టులో నటించింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినా అతని దగ్గర నుంచి రావాల్సిన రూ.90 వేల పారితోషికంతో పాటు, రూ.38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా అతని నుంచి సమాధానం రాకపోయేసరికి నటి.. అతనికి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు రమ్మని చెప్పాడు. బకాయి డబ్బులు ఇస్తాడేమోనని వెళ్లిన ఆమెను.. డబ్బులు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా, బలవంతంగా కారులో తీసుకెళ్లి మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తానంటూ, తన కోరికలు తీర్చాలని అసభ్యంగా