
సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు) సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్ ‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు) 'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు) దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..! మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు