
'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట గురించి తెలిసిందే. ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. సోమవారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు, హీరో అల్లు అర్జున్‌కి సమన్లు జారీ చేసింది. కానీ ఇతడు తప్పితే కేసులో భాగమైన మిగిలిన వాళ్లందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసుని వచ్చే నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. (ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే: అల్లు అర్జున్) హాజరు కానందుకు అల్లు అర్జున్‌కి మెమో దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న బన్నీ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాల్సింది. కానీ ఇతడి తరఫున న్యాయవాది వచ్చారు. ముంబైలో షూటింగ్‌లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ రాలేకపోయారు. ముంబైలో అట్లీ దర్శకత్వంలో తీస్తున్న 'రాకా' షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్) సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్( ఫొటోలు) 'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు) రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు) హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు) తలనొప్పి అని వెళితే.. స్కానింగ్ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్లు కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్ మోసం చేశావ్ అన్నా.. నీకు చేతకాకపోతే చెప్పొచ్చు కదా