సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం
Actor ProfilePolitician

సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం
Zee Telugu9 Aug 2026
సౌదీ అరేబియాలో కుప్ప కూలిన విమానం.. 14 మంది దుర్మరణం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Saudi Aramco helicopter crash news: సౌదీ అరేబియా లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన హెలికాప్టర్ రాస్ తానూరా ప్రాంతంలో కుప్పకూలింది.ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో అధికారులు ఘటన ప్రదేశంకు చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంకు కారణాలు తెలియాల్సి ఉంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలోనే అతిపెద్ద రిఫైనరీ రాస్ తానూరాలో ఉంది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ సౌదీ అరేబియా రాజ్య పౌరులే అని వెల్లడించింది. రాస్ తానూరా హోర్ముజ్ జలసంధి యొక్క తూర్పు-పశ్చిమ తీరంలో ఉంది. మధ్యప్రాచ్యంలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే.. అరామ్కో గల్ఫ్‌లోని కీలకమైన రాస్ తానూరా టెర్మినల్‌లో శుక్రవారం తన ముడి చమురు లోడింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ కూలీపోవడం పెను సంచలనంగా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి