Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో మళ్లీ దాడులు చేస్తున్నారు. హార్ముజ్ జల సంధిని మళ్లీ మూసివేశారు. ఈ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం బంగారం ధరలపై కచ్చితంగా ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పుంజుకోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి వాటితో గ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు దిగివచ్చాయి. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో నిన్నటి సెషన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు అదే ధర వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో జులై 13వ తేదీ సోమవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో జులై 13వ తేదీన బంగారం, వెండి ధరలు భారీగానే దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 26 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 4079 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.48 శాతం దిగివచ్చింది. ప్రస్తుతం ఔన్స్ వెండి రేటు 58 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.490 మేర దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు అదే ధర వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర సైతం స్థిరంగా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,300

రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు గత సెషన్‌లో విదేశీ మదుపర్లు రూ.1355 కోట్ల విలువైన

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు. అయోధ్య రామాలయ విరాళాల

బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు
22k Gold Rate Today: మన దేశంలో బంగారానికి ఉండే డిమాండ్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల వేళ దీనిని అలంకరణ సాధనంగా మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ సందర్భాల్లో

ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది