సీత స్వయంగా లంకను తగలబెట్టడానికి వస్తోంది
Actor ProfileActor

సీత స్వయంగా లంకను తగలబెట్టడానికి వస్తోంది

Total News1
Movie Updates0
Sources1
సీత స్వయంగా లంకను తగలబెట్టడానికి వస్తోంది
Chitrajyothy17 Jun 2026
సీత స్వయంగా లంకను తగలబెట్టడానికి వస్తోంది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్ (Alia Bhatt), శర్వరీ వాగ్ (Sharvari wagh) ప్రధాన పాత్రల్లో శివ రావల్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ఆల్ఫా (Alpha). బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్ (Alia Bhatt), శర్వరీ వాగ్ (Sharvari wagh) ప్రధాన పాత్రల్లో శివ రావల్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ఆల్ఫా (Alpha). స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ స్పై యూనివర్స్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆల్ఫా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ సినిమాలు ఎలా ఉన్నాయో.. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతోందని ట్రైలర్ ని బట్టి అర్దమవుతోంది. అయితే ఈసారి హీరోల బదులు హీరోయిన్లు ఉన్నారు. తల్లిదండ్రులు మరణించడంతో ఒక చిన్నారిని పెంచే బాధ్యతను బాబీ డియోల్ తీసుకుంటాడు. ఆ చిన్నారికి సీత అని పేరుపెట్టి.. ఎంతో కష్టమైన ట్రైనింగ్ ఇచ్చి ఆమెను ఆల్ఫాలా మారుస్తాడు. దేశం కోసం సీత ఏం చేసింది.. ? ఆమె ప్రయాణంలో వెంట వచ్చినవారెవరు.. ? అసలు సీత.. ఆల్ఫాగా ఎందుకు మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రామాయణంలో లంకను హనుమంతుడు తగలబెట్టాడు.. కానీ ఈసారి ఆ లంకను కాల్చడానికి సీత స్వయంగా వస్తోంది అనే డైలాగ్ తో కథను మొత్తం చెప్పేశాడు డైరెక్టర్. ఇక ఈ ట్రైలర్‌లో అలియా భట్, శర్వరీల హై-వోల్టేజ్ యాక్షన్ స్టంట్స్, గన్ ఫైట్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. బాబీ డియోల్ మరోసారి తన క్రూరమైన విలనిజంతో భయపెట్టేందుకు రెడీ అయిపోయాడు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు ట్రైలర్