సీతారామ ప్రాజెక్టు
Actor ProfilePolitician

సీతారామ ప్రాజెక్టు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ను నిలదీసిన సీపీఐ ఎం
HMTV21 Jul 2026
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ను నిలదీసిన సీపీఐ ఎం

Khammam: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ను నిలదీసిన సీపీఐ(ఎం)! ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ధ్వజమెత్తారు. నిధులను వరదలా పారించి ప్రాజెక్టును 2026 పంద్రాగష్టు లోగా అందుబాటులోకి తీసుకొస్తామని 2024 వైరా సభ, సీతారామ పంప్ హౌస్ ల ప్రారంభం సందర్భంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని తుంగలో తొక్కారన్నారు. ఈనెల 30న చింతకాని మండలంలో నిర్వహించే రైతు, ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్న సీఎం సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తారో లేదో? స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే దుమ్ముగూడెం (సీతారామ) ప్రాజెక్టు సిద్ధించిందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంతో పాటు తానూ ఈ ప్రాజెక్టు సాధనకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు. + నెలన్నర రోజుల్లో సీతారామ' పూర్తి చేయగలరా? కాంగ్రెస్ ను ఆదరించిన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వం జిల్లాను నిరాదరణకు గురిచేస్తోందని పోతినేని అన్నారు. 2026 పంద్రాగష్టు లోగా సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తామని స్వయంగా సీఎం పెట్టిన గడువు నెలన్నర రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. రూ.18వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు ఇప్పటికే ఖర్చుపెట్టామని, ఇంకా రూ.10వేల కోట్లతో ప్రాజెక్టు రెండేండ్లలో పూర్తవుతుందని 2024లో సీఎం చెప్పిన మాటను వీడియో రూపంలో ప్రదర్శించారు. సీఎం పెట్టిన 2026 పంద్రాగష్టు గడువుకు ఇంకా నెలన్నర రోజులు మాత్రమే ఉంది... చేయగలరా? అని ప్రశ్నించారు. రూ.18వేల కోట్ల