
భయాన్ని చూడటానికి డబ్బు చెల్లించే విషయంలో అమెరికన్లు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఇక్కడ ప్రతి వారం కనీసం రెండు హారర్ సినిమాలు విడుదలవుతాయి. అయితే అమెరికాలో విడుదలైన ఓ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా, అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు అర్జించిన హారర్ సంచలనం “పారానార్మల్ యాక్టివిటీ” (Paranormal Activity). ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలుస్తూ, డిజిటల్ వీక్షకులను సైతం వణికిస్తోంది. 2007లో ఓరెన్ పెలి అనే స్వతంత్ర దర్శకుడు కేవలం $15,000 (సుమారు ₹12 నుండి ₹13 లక్షలు) బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు. ఎటువంటి భారీ గ్రాఫిక్స్, అగ్ర నటీనటులు లేకుండా కేవలం ‘ఫౌండ్ ఫుటేజ్’ (హోమ్ కెమెరా ద్వారా రికార్డ్ చేసినట్లు చూపే) విధానంలో చాలా సహజంగా దీనిని రూపొందించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు $193 మిలియన్లు (సుమారు ₹1600 కోట్లకు పైగా) వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్’ (పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం) సాధించిన చిత్రంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్.. ఒక యువ జంట (కేటీ, మీకా) తాము కొత్తగా చేరిన ఇంట్లో ఏదో అదృశ్య శక్తి తిరుగుతోందని అనుమానిస్తారు. రాత్రి వేళల్లో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బెడ్‌రూమ్‌లో ఒక వీడియో కెమెరాను అమర్చుతారు. ఆ కెమెరాలో రికార్డ్ అయిన భీతిగొలిపే వింత సంఘటనల సమాహారమే ఈ సినిమా. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించే దయ్యాల రూపాలు, పెద్ద పెద్ద శబ్దాలు ఇందులో ఉండవు. కేవలం తలుపులు