స్టాలిన్ కు కీలక నేతల గుడ్ బై
Actor ProfilePolitician

స్టాలిన్ కు కీలక నేతల గుడ్ బై

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్టాలిన్ కు కీలక నేతల గుడ్ బై, విజయ్ మార్క్ దెబ్బ - టీవీకేకు మద్దతుగా
Oneindia Telugu18 Jun 2026
స్టాలిన్ కు కీలక నేతల గుడ్ బై, విజయ్ మార్క్ దెబ్బ - టీవీకేకు మద్దతుగా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం విజయ్ క్రమేణా రాజకీయంగా పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పలువురు పార్టీకి రాజీనామా చేసి.. విజయ్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే బాటలో డీఎంకే కు చిరకాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎండీకే గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టీవీకేకు మద్దతుగా ఆ పార్టీ ముందుకు వచ్చింది. ఇది స్టాలిన్ క్యాంపు కు ఊహించని దెబ్బగా మారుతోంది.తమిళనాడు రాజకీయంలో అనూహ్య పరిణామం. డీఎంకేకు చిరకాల మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) అధికార తమిళగ వెట్రి కళగం(టీవీకే)తో జట్టుకట్టేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో.. సీఎం జోసెఫ్ విజయ్‌తో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ఇటీవలే వైకో కుమారుడు, ఎండీఎంకే ఎంపీ దురై వైకో కూడా విజయ్‌తో సమావేశమయ్యారు. కాగా.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఎండీఎంకే పోటీచేసి రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ఆ పార్టీ సాధారణ మండలి సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశగా ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.పవన్ భూ ఆక్రమణ వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు..!!తమిళనాడులో ఉప ఎన్నికల రాజకీయం..!అయితే.. టీవీకే నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్షలో ఎండీఎంకే తటస్థంగా వ్యవహరించింది. డీఎంకేతో కలిసి పనిచేసిన పలువురు మాజీ మిత్రపక్షాలు ఇప్పటికే టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు అధికార వ్యవస్థలో భాగస్వాములయ్యాయి. మరోవైపు సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండీఎంకే వైఖరి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రపక్షంగా ఉన్న ఎండీఎంకే అధికారికంగా తమ నిర్ణయం ప్రకటిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలపై వైకో