స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక
Actor ProfilePolitician

స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక
Oneindia Telugu30 Jun 2026
స్టార్మర్ తలరాత మార్చిన మాంచెస్టర్ ఎన్నిక

బ్రిటన్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి, అధికార లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. వీడ్కోలు ప్రసంగంలో భావోద్వేగానికి గురయ్యారు. దేశ ప్రధానిగా పనిచేయడం తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు.తన హయాంలో బ్రిటన్ అంతర్జాతీయ ఖ్యాతి నిలబడిందని, పెట్టుబడులు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రజల, సహచరుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తాను తప్పుకుంటున్నట్లు, తద్వారా శాంతియుత అధికార బదిలీకి మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిపారు. స్టార్మర్ వైదొలగడంతో బ్రిటన్‌లో ఒక కీలక ఘట్టం ముగిసింది. కొంతకాలంగా సొంత పార్టీలోనే నిరసన జ్వాలలు ఎగిసిపడటం, దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వంపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఆయన తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని చారిత్రాత్మక విజయపథంలో నడిపించి, భారీ మెజారిటీతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కీర్ స్టార్మర్.. రెండేళ్లు కూడా పూర్తికాకముందే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో లేబర్ పార్టీ చవిచూసిన ఘోర పరాజయం స్టార్మర్ నాయకత్వ వైఫల్యాలను బయటపెట్టింది.ప్రభుత్వ ఆర్థిక పథకాలు, వివాదాస్పద సంక్షేమ సంస్కరణల పట్ల పార్టీ సభ్యుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. లేబర్ పార్టీ సీనియర్ నేత, గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికలలో ఘనవిజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టడంతో ప్రధాని మార్పు డిమాండ్ ఊపందుకుంది. స్టార్మర్ స్థానంలో బర్న్‌హామ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెడితేనే రానున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధించగలమని పలువురు ఎంపీలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు.బర్న్‌హామ్ రాకతో స్టార్మర్ పదవికి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు ముందే ఊహించారు కూడా. బ్రిటన్ నూతన ప్రధాని రేసులో ఆండీ