స్టార్ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన హీరోయిన్ .. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్
Actor ProfileActor

స్టార్ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన హీరోయిన్ .. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్టార్ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన హీరోయిన్ .. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్
Asianet News Telugu2 Sept 2026
స్టార్ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన హీరోయిన్ .. ప్రియుడిని పరిచయం చేస్తూ సంచలన పోస్ట్

తమిళంలో పాపులర్‌ అయిన హీరోయిన్‌ బ్రిగిడా సాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ ని పరిచయం చేసింది. నటుడు అనంత్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు వైరల్‌గా, సంచలనంగా మారింది. అయితే బ్రిగిడా టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల, బ్రిగిడా సాగా ప్రేమలో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ హీరోయిన్‌తోనే చాలా కాలంగా ఉంటున్నట్టు వార్తలు గుప్పు మన్నాయి. ఒక అజ్ఞాత వ్యక్తి మీడియా వారికి ఈ విషయాన్ని లీక్‌ చేశాడు. భార్యకి అన్యాయం చేస్తూ, ఇలా చేస్తున్నాడనే సందేశాలు పంపించారు. దాదాపు రెండు మూడేళ్లుగా ఈ వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ వార్తలకు, రూమర్లకి చెక్‌ పెట్టింది బ్రిగిడా సాగా. తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేయడం విశేషం. ఇందులో ఆమె ప్రియుడిని ఉద్దేశించి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `చిన్నప్పుడు అందమైన ప్రేమ కథలు కేవలం సినిమాల్లోనే ఉంటాయని నమ్మేదాన్ని, సినిమా పూర్తయి, తెరపై పేర్లు పడిపోయిన తర్వాత కూడా మనసులో అలాగే నిలిచిపోయే కథలవి, కానీ లైఫ్‌ మరోలా ప్లాన్‌ చేస్తుంది. సినిమా రంగంంలో నా ప్రయాణంలో, నాలాంటి కలనే కంటూ, దాన్ని అంతే గౌరవించే ఒక వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతను నా లవ్‌ లైఫ్‌గా మారకముందే, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అత్యంత అందమైన ప్రేమ కథలు ఎప్పుడూ కేవలం తెర కోసం మాత్రమే రాయబడవు, అవి నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. కొన్నిసార్లు అవి నిజ జీవితంలోనే అందంగా సాగుతాయి. ఇదిగో, మా ప్రపంచంలోని ఒక చిన్న భాగం