సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది
Actor ProfileActor

సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది
Eenadu4 Sept 2026
సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది

టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గడంలో సంజు శాంసన్‌దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నాడు. ఐర్లాండ్‌పై 5, 0.. ఇప్పుడు వర్షం

సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది
Eenadu3 Sept 2026
సంజూ భాయ్ .. కత్తి వేలాడుతోంది

వరల్డ్ కప్‌లో రాణించిన హీరోలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిలో భరోసా నింపడం మా బాధ్యత. అలా చేయడం వల్ల రాబోయే టోర్నీల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారు. ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీ20 మ్యాచ్‌ ఎలా ఆడాలో తెలుసు - ఇదీ ఇంగ్లాండ్‌తో తొలి టీ20కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు. అవును కొత్త సారథి శ్రేయస్‌ (Captain Shreyas Iyer) మాటల్లో కొంత నిజమూ ఉంది. ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ప్లేయర్లను పక్కన పెట్టడం సరైంది కాదు. కానీ, సదరు ఆటగాడికి వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే? ఏం చేయాలనే దానిపైనా ఓ స్పష్టత ఇస్తే బాగుండేది. మరోవైపు తనకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఓ లిటిల్ ఛాంపియన్‌ కాచుకుని ఉన్నాడు. ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఇది ఎవరి గురించో? సింగిల్ డిజిట్‌కే పరిమితమై విమర్శలు ఎదుర్కొంటున్న సంజు శాంసన్ ఓ పక్క.. కేవలం 15 ఏళ్లకే హేమాహేమీల బౌలింగ్‌ను తుత్తనీయలు చేసిన వైభవ్ సూర్యవంశీ మరో వైపు పోటీలో ఉండటంతో మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారిపోయింది. టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గడంలో సంజు శాంసన్‌ (Sanju Samson)దే కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అతడే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. గత ప్రపంచ కప్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. ఒకదశలో ఇలాంటి టాలెంట్‌ ప్లేయర్‌ను ఎందుకు పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచుల్లో విఫలమైన అతడిని ఎందుకు ఇంకా ఉంచారు? అనే ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. ఐర్లాండ్‌పై 5, 0.. ఇప్పుడు వర్షం కారణంగా మధ్యలోనే రద్దు అయిన ఇంగ్లాండ్‌పై తొలి టీ20లో కేవలం ఒక్క పరుగే చేశాడు. గతంలోనూ చాలా మంది విఫలమయ్యారు కదా.. అప్పుడెవరూ ఎందుకు