సుజిత్ ఈ సారి జాగ్రత్తపడతాడా
Actor ProfileActor

సుజిత్ ఈ సారి జాగ్రత్తపడతాడా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సుజిత్ ఈ సారి జాగ్రత్తపడతాడా
Chitrajyothy3 Aug 2026
సుజిత్ ఈ సారి జాగ్రత్తపడతాడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్, స్వాగ్ చూస్తే థియేటర్లలో పేపర్లు ఎగరాల్సిందే, విజిల్స్‌ మోగాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్, స్వాగ్ చూస్తే థియేటర్లలో పేపర్లు ఎగరాల్సిందే, విజిల్స్‌ మోగాల్సిందే. రీసెంట్ టైమ్స్‌లో పవన్ ఫ్యాన్స్‌కు ఆ స్థాయిలో పూనకాలు తెప్పించిన సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా ‘ఓజీ’ (OG Movie) అని ప్రతీ ఒక్కరు ఒప్పుకుంటారు. పవర్ స్టార్‌ను నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో చూపించి, తానొక వీరాభిమానిని అని డైరెక్టర్ సుజిత్ నిరూపించుకున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్‌‌తో బ్లడ్‌ బాత్‌ను చూపించి ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇచ్చారు. అయితే మొదటి పార్ట్‌లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో, అందులో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నది ఫ్యాన్స్ సైతం గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద సుజిత్ (Sujeeth) పెట్టిన శ్రద్ధ... కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త తగ్గించారని, స్టోరీలో డెప్త్ మిస్ అయ్యిందనేలా విమర్శలు వచ్చాయి. కాకపోతే ఎలివేషన్ సీన్స్ ఆ రేంజ్‌లో పేలడంతో ఆ చిన్న చిన్న తప్పులు పెద్దగా కనిపించకుండా, సినిమా అలా నెట్టుకుపోయింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. సుజిత్ ‘ఓజీ-2’ (OG 2)ను భారీ స్థాయిలోనే అనౌన్స్ చేశారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి సుజిత్ గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఈ