సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ
Actor ProfilePolitician

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ

Total News2
Movie Updates0
Sources2
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ
Vaartha15 Jun 2026
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం అత్యంత కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌లతో సీఎం విడివిడిగా భేటీ అయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ అభ్యున్నతి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సాగిన ఈ చర్చల్లో ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ప్రధానంగా దృష్టి సారించాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రముఖ విమానాశ్రయాల నుండి సింగపూర్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు, ఎయిర్ కనెక్టివిటీని గణనీయంగా పెంచే అవకాశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. read also: Nara Lokesh: సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో జరిగిన సమావేశంలో ఏపీలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరించారు. భవిష్యత్ దార్శనికతతో నిర్మిస్తున్న అమరావతి రాజధాని ప్రణాళికలను ఆయన ముందుంచారు. తయారీ, సేవల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకుపోతోందని.. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని పోర్టుల ద్వారా సరకు రవాణాను మెరుగుపరుస్తున్నామని సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవనుందని స్పష్టం చేశారు. అలాగే, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్, ప్రపంచాన్ని అనుసంధానించే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టుల పురోగతిని తెలియజేశారు. రాజధాని అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా మారుస్తున్నామని, ఉత్తరాంధ్రలో గ్లోబల్ స్టీల్ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన వెల్లడించారు. దీనికిముందు, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో అమరావతితో పాటు ఏపీలోని

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
Andhra Jyothy15 Jun 2026
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా