SSY Interest Rates: కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అందించే వడ్డీ రేట్లను ఖరారు చేసింది. అయితే, మరోసారి ఈ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వరుసగా 9వ త్రైమాసికం (2026- 27 జులై- సెప్టెంబర్) లోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇప్పటి వరకు అందిస్తున్న వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 2026 మార్చి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు నోటిఫై చేసిన వడ్డీ రేట్లనే వచ్చే త్రైమాసికం 2026 జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ నోటీఫికేషన్ విడుదల చేసింది.సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్రా, పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ల వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా 2026- 27 లోని జూన్- సెప్టెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్లను ఖరారు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. చివరి సారిగా 2023- 24 నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి)లో కొన్ని పథకాల వడ్డీ రేట్లను సవరించింది. ఇక అప్పటి నుంచి యథాతథంగానే కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏ పథకంపై వడ్డీ రేటు ఎలా ఉందో పూర్తి లిస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.వడ్డీ రేట్లు ఇలా 10 ఏళ్ల వయసులోపు ఆడ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పై 8.20 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)పై 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇక 3 సంవత్సరాల మెచ్యూరిటీ కాల వ్యవధితో ఉంటే టర్మ్ డిపాజిట్ పథకంపై 7.10
Samayam Telugu•24 Aug 2026
సుకన్య యోజన, వంటి పథకాలకు.. కొత్త వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్రం.. వరుసగా 9వ సారి ఇలా